ETV Bharat / state

'నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి' - RYTHU SAMKSHEMA DEEKSHA

వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా రైతు సంక్షేమ దీక్ష నిర్వహించారు. దీనిలోభాగంగా వికారాబాద్​ జిల్లా డీసీసీ అధ్యక్షుడు తన నివాసంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు.

Vikarabad DCC President  RYTHU SAMKSHEMA DEEKSHA
'నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'
author img

By

Published : May 5, 2020, 4:39 PM IST

వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి పరిగిలోని తన నివాసంలో ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్​ ఇరిగేషన్ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేసి జిల్లా రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల వద్ద ప్రభుత్వం కొనుగోలు చేసిన కందులు, శనగల డబ్బులు వెంటనే రైతులకు చెల్లించాలని కోరారు.

ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలిపారు. రైతు ఋణమాఫీ, రైతు బంధు అన్నదాతలకు సరిగ్గా అందేలా చూడాలని...లేదంటే ఉద్యమించాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.