ETV Bharat / state

'కాంగ్రెస్​ నేతల కృషికి ఫలితమే వికారాబాద్​ చార్మినార్ జోన్​లో కలిసింది​​' - _Dcc_President_Pc

వికారాబాద్​ జిల్లాను చార్మినార్​ జోన్​లో కలుపుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్​ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ పార్టీ చేసిన కృషికి ప్రతిఫలమని డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్​ రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్​ కుమార్​ అన్నారు.

'కాంగ్రెస్​ నేతల కృషికి ఫలితమే వికారాబాద్​ చార్మినార్ జోన్​లో కలిసింది​​'
author img

By

Published : Sep 5, 2019, 12:32 AM IST

జోగులాంబ గద్వాల్‌ జోన్‌లో కలిపిన వికారాబాద్‌ జిల్లాను తిరిగి చార్మినార్‌ జోన్‌ పరిధిలో కలపడంపై ఆ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌ రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కొన్నాళ్లుగా తాము చేసిన పోరాటం ఫలించిందన్నారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత వికారాబాద్​ను జోగులాంబ గద్వాల్​లో కలపడం వల్ల జిల్లా వాసులు తీవ్రంగా నష్టపోయారని రామ్మోహన్​ రెడ్డి పేర్కొన్నారు. చార్మినార్​జోన్​లో కలపాలని కోరుతూ తాము చేసిన నిరాహార దీక్షలు, బంద్‌లు, మంత్రులను అడ్డుకోవడం లాంటి అనేక కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా చేపట్టడం వల్లనే ప్రభుత్వం దిగొచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేలా ప్రయత్నిస్తామని మాజీ మంత్రి ప్రసాద్​ కుమార్​ అన్నారు.
ఇదీ చూడండి: 'ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర'

Tg_hyd_85_04_DCC_PRESIDENT_PC_AB_3038066 Reporter: M.Tirupal Reddy గమనిక: గాంధీభవన్‌ ఓఎఫ్‌సీ నుంచి ఫీడ్‌ వచ్చింది. వాడుకోగలరు. ()జోగులాంబ గద్వాల్‌ జోన్‌లో కలిపిన వికారాబాద్‌ జిల్లాను తిరిగి చార్మినార్‌ జోన్‌ పరిధిలోకి జిల్లాలో కలిపడంపై ఆ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌ రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌లు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. కొన్ని రోజులుగా తాము చేసిన పోరాటం ఫలించిందన్నారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో...కొండా వెంకట రంగారెడ్డి చేసిన సేవలకు గుర్తుగా హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ రంగా రెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఉన్నఫలంగా చార్మినార్‌ డివిజన్‌లో ఉన్న వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ జోన్‌లోకి కలిపారని...ఆలా చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతామన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నిరాహార దీక్షలు, బంద్‌లు, మంత్రులను అడ్డుకోవడం లాంటి అనేక కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా చేపట్టడంతోనే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి తిరిగి చార్మినార్‌ జోన్‌లోకి కలిపినట్లు వివరించారు. బైట్: రామ్మోహన్‌ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, వికారాబాద్‌ జిల్లా బైట్: ప్రసాద్‌కుమార్‌, మాజీ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.