వికారాబాద్ జిల్లా పరిగిలోని మూడో వార్డులోని పార్కులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొక్కలు నాటారు. 'మొక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే వర్షాలు బాగా పడతాయి. ఈ ప్రాంతంలో... రైతులు చాలా వరకు వర్షాధార పంటలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి అటవీ ప్రాంతం వృద్ధి చెందేలా చేస్తే రైతులకు ఎంతో మేలు చేసిన వారిమవుతాం' అని మంత్రి అన్నారు.
అనంతరం రంగంపల్లి తండాలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పౌసుమి బసు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'రామాయణం నుంచి మొదలు పెడితే 1991 దాకా ఒక్కరూ లేరు'