వికారాబాద్ జిల్లా పరిగి హరిజనవాడ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం ముందు భాగం కూలిపోయింది. పాఠశాలకు సోమవారం సెలవు కావడంతో విద్యార్థులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా... వారు పట్టించుకోలేదని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కూలుతున్న గోడలను చూస్తుంటే భయంగా ఉందని విద్యార్థులు వాపోయారు. చదువుపై శ్రద్ధ పెట్టలేక పోతున్నామని ఆవరణలో ఆడుకోలేక పోతున్నామని తెలిపారు.
ఇదీ చూడండి :ఆ కాలనీలో తాగునీరు రాక ఆరునెలలు..