విధి నిర్వహణలో పడి ఆరోగ్యాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని వికారాబాద్ జిల్లా పరిగి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. పోలీసులు ఉద్యోగంతో పాటు ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టాలని సూచించారు. పట్టణంలోని ఓ కళ్యాణమంటపంలో పోలీసుల ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు.
పోలీసుల ఆరోగ్య బాధ్యత తమదేనని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారని... ఆయన ఆదేశాల మేరకే ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ శిబిరంలో పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు, జర్నలిస్టులకు, ప్రజలకు షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి... అవసరమైన మందులు రాసిచ్చారు.
ఇదీ చూడండి : 'బ్యాంకు సేవల్లో లోపానికి పరిహారం చెల్లించాలన్న వినియోగదారుల ఫోరం'