వికారాబాద్ జిల్లా పరిగిలో వ్యవసాయ మార్కెట్ యార్డులో కందులు కొనేందుకు ఈ నెల 3న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. నేటికి 25 రోజులు గడిచినా ఒక్క క్వింటా కూడా కొనలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఎకరానికి ఐదు నుంచి ఏడు క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వస్తుందని కానీ కొనుగోలు కేంద్రంలో మాత్రం రెండున్నర క్వింటాళ్ల కందులు కొనుగోలు చేస్తామని చెబుతున్నారని అన్నదాతలు వాపోతున్నారు. ఆగ్రహించిన కర్షకులు హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై బైఠాయించారు.
ఇదీ చూడండి: 'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్ పిటిషన్