వికారాబాద్ దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసే నేవీ రాడార్ స్టేషన్‌తో ఇక్కడి అటవీ ప్రాంతానికి నష్టం వాటిల్లుతుందని పర్యావరణ ప్రేమికులు పురుషోత్తం రెడ్డి చెప్పారు. నేవీ రాడార్ స్టేషన్ రద్దు చేయాలంటూ పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు చేపట్టిన సామూహిక నిరాహార దీక్షలో ప్రసంగించారు.
నేవీ రాడార్ స్టేషన్ తరంగాల వల్ల సమీప గ్రామాల ప్రజలు రోగాల బారిన పడతారని.. చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. కొన్ని వేల సంవత్సరాలుగా అటవీ ప్రాంతంలో ఉన్న చెట్లు నేలమట్టమయ్యే అవకాశముందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నేవీ రాడార్ స్టేషన్ రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పూడూరు సొసైటీ ఛైర్మన్ నరసింహారెడ్డి, నిత్యానంద స్వామి, పూడూర్ ఉపసర్పంచి రాజేందర్, పలు గ్రామాల ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప బహుమతి... ఆధ్యాత్మికత'