ETV Bharat / state

చేతివాటం... కందుల సొమ్ము కాజేశారు..

కొడంగల్‌ మార్కెట్‌ యార్డులో కందుల సొమ్ము స్వాహా వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. గడిచిన జనవరి నుంచి మార్చి వరకు జరిగిన అక్రమాలు ఒక్కకొక్కటిగా వెలుగు చూస్తుండటం మార్కెట్‌ వర్గాల్లో గుబులురేపుతోంది. అధికారులు, దళారులు ఏకమై ఈ అవినీతి పర్వానికి తెర తీసి, నిధులను వ్యక్తిగత ఖాతాలకు జమ చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

curruption In the yard of Kodangal Market, vikarabad district
చేతివాటం... కందుల సొమ్ము కాజేశారు
author img

By

Published : Sep 8, 2020, 9:51 AM IST

దళారుల రాజ్యం..: కొడంగల్‌ మార్కెట్‌ యార్డులో ముడుపులకు అలవాటు పడిన అధికారులు దళారులకే అగ్రతాంబూలం వేస్తున్నారు. సుమారు 10 మంది వరకు దళారులు నిత్యం కార్యాలయం వద్దే ఉంటారనే విమర్శలు ఉన్నాయి. వారు రైతుల నుంచి తక్కువ ధరకు పంట కొనుగోలు చేసి, తమకు బాగా పరిచయం ఉన్న రైతులకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు, బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలను సేకరించి, వారి పేరిట మార్కెట్‌ యార్డులో విక్రయిస్తుంటారు. ప్రభుత్వం నుంచి సొమ్ము వచ్చిన తరువాత రూ.2వేల వరకు పాసుపుస్తకాల నకలు ఇచ్చిన రైతులకు ఇచ్చి, మిగతా సొమ్ము జేబులో వేసుకుంటారు.

వెలుగులోకి వచ్చిందిలా..

మార్కెట్‌ యార్డులో మార్చి వరకు కందుల కొనుగోళ్లు జరిగాయి. తర్వాత కరోనా కారణంగా కొన్నాళ్ల పాటు లావాదేవీలు నిర్వహించలేదు. సడలింపుల తర్వాత విధులకు హాజరైన అధికారులు కొనుగోలు చేసినట్లు రికార్డులో చూపిస్తున్న సంఖ్యకు, గోదాంలో ఉన్న బస్తాల సంఖ్యకు పొంతన లేకపోడం గుర్తించారు. దీంతో జూన్‌ నుంచి అంతర్గత విచారణ ప్రారంభించారు. సుమారు 2,500 బస్తాలకు సంబంధించి రూ.73 లక్షలు దారి మళ్లించినట్లు తేల్చారు. ఈ వ్యవహారానికి సంబంధించి డీసీఎమ్మెఎస్‌ మేనేజర్‌ను విధుల నుంచి తప్పించారు. మరోవైపు 139 మంది రైతులు కందులు విక్రయించి నెలలు గడుస్తున్నా ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు తీర్చ లేకపోతున్నామని వాపోతున్నారు. సకాలంలో నగదు ఇవ్వాలని కోరుతున్నారు.

యార్డులో మొత్తం కందులు విక్రయించిన రైతులు 5100

బస్తాలు 1.27 లక్షలు

కొడంగల్‌ మర్కెట్‌లో జనవరిలో 20 క్వింటాళ్ల కందులు విక్రయించా. 15 రోజుల నుంచి నెల రోజుల్లోగా వస్తాయని ఎదురు చూశాం. తొమ్మిది నెలలు కావస్తోంది. కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. అడిగినప్పుడల్లా భూమి పత్రాల నకలు ఇస్తున్నా. రెండు రోజుల క్రితం వెళ్లితే పది రోజుల్లో ఇస్తామన్నారు. పెట్టుబడులకు చేసిన అప్పుకు మిత్తి కట్టుకోలేకపోతున్నా. - లాలప్ప, దేవరఫస్లాబాద్‌, దౌల్తాబాద్‌ మండలం.

పెసర రైతుల్లో గుబులు..

ప్రస్తుతం పెసర పంట చేతికొచ్చింది. రైతుల దగ్గర తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధరలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాకు సరిహద్దులోని కర్ణాటక నుంచి పెసలు వస్తున్నాయనే విమర్శలున్నాయి. దీనిపై ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

వికారాబాద్‌ మున్సిపాలిటీ: దళిత వాడల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ సోమవారం జిల్లా అదనపు పాలనాధికారి మోతీలాల్‌కు కేవీపీఎస్‌ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దళిత, గిరిజనవాడలకు రూ.10 లక్షలు చొప్పున కేటాయించాలన్నారు. దళిత వాడల్లో రోడ్లు, వీధిదీపాలు, కమ్యూనిటీ భవనాలు నిర్మించాలని కోరారు. కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు మల్కయ్య, కార్యదర్శి ఆర్‌.మహిపాల్‌, ఉపాధ్యక్షుడు సుదర్శన్‌, నాయకులు పాల్గొన్నారు.

తుమ్మ చెట్లు ఉన్న పొలంలో 100 క్వింటాళ్ల కందులు పండించినట్లు నకిలీ పత్రాలు సృష్టించి మార్కెట్‌ యార్డు సొమ్ము స్వాహా చేశారు. ఇలాంటి వారికి బిల్లులు వెంటనే వస్తున్నాయి. నిజాయితీగా కందులు పండించి, మార్కెట్‌కు తెచ్చిన రైతులకు 9 నెలల నుంచి బిల్లులు రావడం లేదు. కొంత మంది రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అవుతున్నాయి. - మహిపాల్‌, జడ్పీటీసీ సభ్యుడు, దౌల్తాబాద్‌.

రెండు ఎకరాల్లో కంది పండించా. ఎనిమిది క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. జనవరిలో కొడంగల్‌ మార్కెట్‌ యార్డులో విక్రయించా. ఇప్పటి వరకు డబ్బులు జమకాలేదు. గతేడాది చేసిన అప్పులు తీరలేదు. ఈ ఏడాది పెట్టుబడి కోసం మళ్లీ అప్పు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వంపై నమ్మకంతో మార్కెట్‌కు వస్తే డబ్బుల కోసం కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు.- అమీర బేగం, తిమ్మారెడ్డిపట్టి, దౌల్తాబాద్‌ మండలం.

వారంలో జమ చేస్తాం..

కందులు విక్రయించిన రైతులు అందరికీ వారం రోజుల్లో నగదు ఖాతాలో జమ చేస్తాం. నిధుల దుర్వినియోగంపై కేసు నమోదు చేశాం. విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఓ అధికారిని సస్పెండ్‌ చేశాం. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది పోలీసుల విచారణలో తేలనుంది. పాండురంగం, డీసీఎంఎస్‌ జిల్లా మేనేజర్‌.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.