వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్ తాండూరు ఆర్టీసీ డిపో పరిసరాలను శనివారం తనిఖీ చేశారు. డిపో నుంచి నడిపిస్తున్న బస్సులు, తాత్కాలిక సిబ్బంది, విధులు తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. డిపో పరిధిలో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బస్సుల్లో ఇకనుంచి టికెట్లు ఇచ్చేందుకు యంత్రాలను సిద్ధం చేసినట్లు జిల్లా పాలనాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రాజశేఖర్, ఆర్డీఓ వేణు మాధవ్, డీఎస్పీ రామచంద్రుడు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : క్వాలిఫై కాకుండా ఉద్యోగం ఎలా ఇచ్చారు?