వికారాబాద్ జిల్లా కేంద్రంలో కోటి పది లక్షల రూపాయలతో చేపట్టిన రహదారి అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆర్టీసీ బస్ డిపో నుంచి ఎన్నేపల్లి కూడలి వరకు సెంట్రల్ లైటింగ్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
ఇప్పటి వరకు చీకట్లో ఉన్న ఈ రహదారి ప్రస్తుతం ఎల్ఈడి వెలుగులతో ఆకట్టుకుంటోంది. దీన్ని చూసిన స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'రాష్ట్రం నుంచి తెరాసను తరిమికొట్టాల్సిన బాధ్యత ప్రజలదే'