అసెంబ్లీలో రెవెన్యూ చట్టం అమోదం పొందగా వికారాబాద్ జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. ఎడ్లబండ్లపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుచి ఎంఆర్పీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. దారి పొడుగునా టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.
కేసీఆర్ తెచ్చిన రెవెన్యూ చట్టంతో ప్రజల ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. బలవంతుల దౌర్జన్యానికి చరమగీతం పాడేందుకే సీఎం ఈ చట్టాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో శివారెడ్డి సొసైటీ ఛైర్మన్ ముత్యంరెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు విజయ్, మున్సిపల్ ఛైర్పర్సన్ మంజుల తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ వ్యూహరచన