సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పర్యటించారు. జాతీయ రహదారి సమీపంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు కృత్రిమ గర్భాధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మత్య్సకారులకు వందశాతం రాయితీతో ప్రభుత్వం అందిస్తోన్న చేపపిల్లలను కోదాడ చెరువులో విడిచిపెట్టారు.
కోదాడ చెరువులో 4.44 లక్షల నాణ్యమైన చేపపిల్లల్ని విడుదల చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు. కులవృత్తులను గౌరవించి, వారికి పలు రాయితీలు అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా మత్య్సశాఖ అధికారిణి సౌజన్య, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీచూడండి : 'వైద్యులు పట్టించుకోవడం లేదు.. నేను బతకను'