సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గుమ్మడవెల్లిలో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో మనస్తాపం చెందిన పిప్పళ్ల శ్రీకాంత్ అనే రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
పంటలు సరిగా పండకపోవడం వల్ల పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీరలేదు. దీనికి అనారోగ్య సమస్యలు తోడు కావడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఎవరూ లేని సమయంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతునికి కూతురు, కుమారుడు ఉన్నారు. భార్య సునీత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై నాగయ్య తెలిపారు.
ఇవీ చూడండి: ప్రగతిలో భేష్: దేశానికే ఆదర్శంగా తెలంగాణ: గవర్నర్