సూర్యాపేట జిల్లా మునగాల మండలానికి చెందిన పుట్టా రుక్మిణి రోజు మాదిరి ఉదయాన్నే గడ్డి కోయడానికి పొలానికి వెళ్లింది. అక్కడ తెగిపడిన విద్యుత్ తీగపై కాలు పెట్టడం వల్ల విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందింది. ఆమెతో పాటే వెంట ఉన్న పెంపుడు శునకం కూడా విద్యుత్ షాక్ తగిలి మరణించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
- ఇదీ చూడండి : కత్తులు, గొడ్డళ్లతో తెరాస, కాంగ్రెస్ వర్గీయుల దాడి