పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతారణం కల్పించాలనే లక్ష్యంతో గ్రామగ్రామాన పల్లె ప్రకృతి వనాలు ఏర్పడ్డాయి. రంగు రంగుల పూలు, నీడనిచ్చే చెట్లు, అందంగా కనిపించే పచ్చని మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం తాళ్ల సింగారం సర్పంచి లింగారెడ్డి, పంచాయతీ కార్యదర్శి గిలకత్తుల సుధాకర్ గౌడ్ ప్రత్యేక చొరవతో పల్లె ప్రకృతి వనం ద్వారా చక్కని వాతావరణంతో పాటు తాజా కూరగాయలు పొందుతున్నారు.
పల్లె ప్రకృతి వనంలో పాలకూర, చుక్కకూర, మెంతికూర, కొత్తిమీరా, పుదీన వంటి ఆకు కూరలతోపాటు... వంకాయ, టమాట, బెండకాయ, సోరకాయ వంటి కాయగూరలను ఎరువులు వాడకుండా పండిస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉందని అంటున్నారు.
ఇదీ చదవండి: ఆంధ్రా వరుడు... ఆఫ్గాన్ వధువు... విజయవాడలో మనువు