ETV Bharat / state

'పవన్​కల్యాణ్​కు సీఎం అయ్యే లక్షణాలు మెండుగా ఉన్నాయి' - రేవంత్​రెడ్డిపై వీహెచ్​ విమర్శలు

సూర్యాపేట జిల్లా దొండపాడు గ్రామంలో వంగవీటి మోహన రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు పాల్గొన్నారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. వంగవీటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని ఆయన ఎదుగుదల చూడలేకే ప్రత్యర్థులు హత్య చేశారని వీహెచ్​ ఆవేదన వ్యక్తం చేశారు.

vh participated in vangaveeti idolatry event in suryapet district
'పవన్​కల్యాణ్​కు సీఎం అయ్యే లక్షణాలు మెండుగా ఉన్నాయి'
author img

By

Published : Dec 26, 2020, 6:48 PM IST

వంగవీటి మోహనరంగ ఎదుగుదల చూడలేకే ఆయనను హత్య చేశారని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు అన్నారు. వంగవీటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం, దొండలపాడు గ్రామంలో వంగవీటి విగ్రహాన్ని వీహెచ్​ ఆవిష్కరించారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు.

పవన్​ కల్యాణ్​కు పీసీసీ ఇప్పిస్తా

ఈ సందర్భంగా సినీనటుడు పవన్ కల్యాణ్​పై వి.హెచ్​ పరోక్షంగా విమర్శలు చేశారు. అత్యల్ప ప్రజాదరణ ఉన్న నాయకులు ముఖ్యమంత్రులు అవుతున్నారు. కానీ 54 శాతం ప్రజాదరణ ఉన్న పవన్​..​ ఎందుకు సీఎం కాకూడదని అన్నారు. ఆయన అనవసరంగా మతతత్వ పార్టీ భాజపాతో చేతులు కలిపారని.. దయచేసి ఆ పార్టీని వీడితే సోనియా, రాహుల్​గాంధీలతో తాను మాట్లాడి ఆంధ్రప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్ష పదవిని ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. పవన్​కు ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

'పవన్​కల్యాణ్​కు సీఎం అయ్యే లక్షణాలు మెండుగా ఉన్నాయి'

రాజకీయ అనుభవం లేని రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని వీహెచ్​ మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై ఎన్ని విమర్శలు చేసినా తనను ఎవరూ బెదిరించలేదని.. కానీ కొత్త నాయకులు అభిమానుల పేరుతో బెదిరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి బెదిరింపులకు తాను భయపడనని అన్నారు.

ఇదీ చదవండి: పార్టీ బాగుపడాలి.. తిరిగి అధికారంలోకి రావాలి: మల్లు రవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.