ETV Bharat / state

'మంత్రులవే ప్రాణాలా..? ప్రజలవి కావా..?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉత్తమ్ ' - cm kcr latest news

పారిశుద్ధ్య కార్మికులకు, వైద్యులకు, పోలీసులకు, జర్నలిస్టులు కరోనా బారిన పడి మరణిస్తే 50 లక్షల పరిహారం ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టులను కరోనా వారియర్స్​గా గుర్తించాలని కోరారు.

'తెలంగాణ సమాజం సీఎం కేసీఆర్, మంత్రి ఈటలను ఛీ కొడుతోంది'

author img

By

Published : Jun 30, 2020, 5:11 PM IST

Updated : Jun 30, 2020, 5:36 PM IST

దేశవ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు విస్తృతంగా జరుగుతున్నాయిని.. తెలంగాణలో పరీక్షల నిర్వహణ సంఖ్య చాలా తక్కువగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు . జాతీయ స్థాయి కంటే రాష్ట్రంలో సగటు తక్కువగా ఉండటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శమన్నారు. సగటున పది లక్షల మందిలో వెయ్యి మందికే పరీక్షలు చేస్టున్నారని ఆరోగ్య శాఖ నివేదికలు చెబుతున్నాయని ఉత్తమ్ అన్నారు.

'తెలంగాణ సమాజం సీఎం కేసీఆర్, మంత్రి ఈటలను ఛీ కొడుతోంది'

పక్క రాష్ట్రమే నయం...

పక్క రాష్ట్రం ఏపీలో సగటున 9 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తే... మహారాష్ట్రలో 5 వేల మందిని పరీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. చత్తీస్ ఘడ్​లో 4 వేలు మేర పరీక్షలు చేస్తున్నారని అన్నారు. దేశంలో సగటున ప్రతి పది లక్షల మందిలో 4వేల కొవిడ్ వైద్య పరీక్షలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇది సీఎం కేసీఆర్​కు సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్ర సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. కేసీఆర్ తీరు వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ తుగ్లక్ మాదిరి లెక్కలు చెబుతూ..రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించారని ఆందోళన వ్యక్తం చేశారు.

4 కోట్ల మందికి ఒక్కటేనా ?

గ్రేటర్ హైదరాబాద్​లోని 30 నియోజకవర్గాల పరిధిలో 50 వేల పరీక్షలు చేస్తామన్న కేసీఆర్ మాట ఆ దేవుడికే తెలియాలన్నారు. లాక్​డౌ​న్ కాలంలో కంటైన్​మెంట్ జోన్ వద్ద లిక్కర్ దుకాణాలు తెరవడంపై ఉత్తమ్ మండిపడ్డారు. మందు దుకాణాలు నిర్వహించడం వల్లే కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తోందన్నారు. సుమారు 4 కోట్ల మందికి కోవిడ్ ఆస్పత్రిగా గాంధీ ఒక్కటే ఉండటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శమన్నారు.

గాంధీలో తెరాస నేతలు ఎక్కడా ?

గాంధీలో సదుపాయాలు అద్భుతం అంటే తెరాస ఎమ్మెల్యేలు, మంత్రులెవరూ అక్కడికి వెళ్లకుండా కార్పొరేట్ ఆస్పత్రిలో ఎందుకు చికిత్స పొందుతున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లో కొవిడ్ ఆస్పత్రి కేంద్రాలను పెంచాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

మీ వల్లే వారు మరణించారు..

ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దిగాజారి మాట్లాడుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేకే జర్నలిస్ట్ మనోజ్​ మరణించారని ఉత్తమ్ అన్నారు. తాజాగా ఓ యువకుడు రవి కుమార్, హైదరాబాద్ ఛాతీ ఆస్పత్రిలో ఆక్సిజన్ లేక చనిపోయాడన్నారు. ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు కల్పించని ప్రభుత్వాన్ని చూసి యావత్ తెలంగాణ సమాజం ఛీ కొడుతోందని ఉత్తమ్ ధ్వజమెత్తారు. అందుకే ఇప్పటికైనా వేకప్ కేసీఆర్.. వేకప్ తెలంగాణ ప్రభుత్వం అంటూ సూచించారు.

ఇవీ చూడండి : నవంబర్​ వరకు ఉచితంగా ఆహారధాన్యాల పంపిణీ: మోదీ

Last Updated : Jun 30, 2020, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.