ETV Bharat / state

ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ పాదయాత్ర - ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుకు వ్యతిరేకంగా మహాజన విద్యార్థి పాదయాత్ర

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ మహాజన విద్యార్థి పాదయాత్రను మోత్కూరు మండలం ముసిపట్ల నుంచి ప్రారంభించారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు.

ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ పాదయాత్ర

author img

By

Published : Sep 29, 2020, 8:48 PM IST

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ మహాజన విద్యార్థి పాదయాత్రను మోత్కూరు మండలం ముసిపట్ల నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మహాజన స్టూడెంట్ యూనియన్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘాల నాయకులు నిర్వహిస్తున్నారు.

మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంఛార్జ్​ కందుకూరి సోమన్న, ఎంఎస్​ఎఫ్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొజ్జ సైదులు మాదిగ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహాజన స్టూడెంట్ యూనియన్ నియోజకవర్గ ఇంఛార్జ్​ భూషిపక గణేశ్​, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ తడకమళ్ల రవికుమార్, ఎంఎస్​ఎఫ్​ ఓయూ జనరల్ సెక్రెటరీ చిప్పలపల్లి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అమల్లోకొచ్చిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.