సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటించారు. మండలకేంద్రంలోని నర్సరీని పరిశీలించారు. రైతులు కోరిన మొక్కలను వారికి అందించాలని నర్సరీ నిర్వాహకులకు సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో భూ దస్త్రాలు పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు అందించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు.
కలెక్టర్ వెంట తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీఓ సరోజ, సర్పంచ్ ఇంతియాజ్, మండల వ్యవసాయ అధికారిణి దివ్య, జిల్లా రైతు బంధు సమితి సమన్వయకర్త రజాక్ ఉన్నారు.
- ఇవీ చూడండి: సీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ