ETV Bharat / state

పదో తరగతి పరీక్షల్లో బెంచీకి ఒక్కరే..

కరోనా నేపథ్యంలో మధ్యలో ఆగిన పదో తరగతి పరీక్షలు త్వరలోనే పునఃప్రారంభం కానున్నాయి. రాష్ట్ర హైకోర్టు సానుకూల తీర్పు నేపథ్యంలో విద్యాశాఖ వచ్చేనెలలోపు మిగిలిన పరీక్షలను త్వరితగతిన పూర్తిచేయాలని భావిస్తోంది. పరీక్షల నిర్వహణకు సంబంధించి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేయనుంది.

author img

By

Published : May 22, 2020, 7:03 AM IST

ssc exam arrangements in nalgonda district
బెంచీకి ఒక్కరే

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో 44 వేల మంది బాలబాలికలు పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమయ్యారు. తెలుగు రెండు పేపర్లు, హిందీ పరీక్ష ముగిసిన తర్వాత కరోనా వ్యాప్తి పెరగడంతో మిగిలిన పరీక్షలను వాయిదా వేశారు. ఉమ్మడి జిల్లాలో 208 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు.

ఇప్పుడు భౌతిక దూరం పాటించాల్సి రావడంతో అదనంగా 170 కేంద్రాలు అవసరమవుతాయని జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. బెంచీకి ఒక్కరు చొప్పున పాత హాల్‌టికెట్లతోనే పరీక్షలు రాయించాలని భావిస్తున్నారు. గతంలో గదిలో 24 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, ఈసారి 12 మందినే అనుమతించాలని ప్రతిపాదించారు. పరీక్ష కేంద్రం ఉన్న పాఠశాలల్లోనే అదనపు గదులుంటే వాటిని వినియోగిస్తారు. లేదా 500 మీటర్లలోపు ఉన్న పాఠశాలను మరో పరీక్ష కేంద్రంగా మార్చాలని ప్రతిపాదించారు.

స్వీయ నియంత్రణే ముఖ్యం

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, సిబ్బంది తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు ధరించాలని ప్రతిపాదించారు. పరీక్ష కేంద్రాలు పెరిగిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది అవసరమవుతారు. గతంలో 240 మంది విద్యార్థులున్న కేంద్రాలకు ఒక సూపరింటెండెంట్‌ ఉండేవారు. ఇప్పుడు 120-150 మందికి ఒక సూపరింటెండెంట్‌ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. సమయానికి విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు తరలించేలా ఆర్టీసీతో చర్చలు జరుగుతున్నాయి. ప్రతి కేంద్రంలో శానిటైజర్‌ లేదా సబ్బు, నీళ్లు తప్పనిసరి ఉండేలా ఆయా సూపరింటెండెంట్లు బాధ్యత తీసుకోవాలి.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిచేస్తాం

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ తీసుకుని అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ పరీక్షలను పూర్తిచేస్తాం. గతం కంటే ఈసారి పరీక్ష కేంద్రాలు, సిబ్బంది పెరిగారు. విద్యార్థులకు, సిబ్బందికి మాస్కులు ప్రభుత్వమే ఇచ్చే విషయంపై చర్చ నడుస్తోంది. నిత్యం పరీక్ష కేంద్రాలను, విద్యార్థులను తీసుకొచ్చే బస్సులను ప్రత్యేక రసాయనాలతో శుభ్రంచేయిస్తాం. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు అందిన వెంటనే జిల్లా అధికారులతో సమన్వయ పరిచి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. విద్యార్థుల గురించి తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు. పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవ్వాలి.

- భిక్షపతి, డీఈవో, నల్గొండ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.