సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కేంద్రంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద నిర్మించిన ఆలయంలో స్వామి వారి కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి వివాహ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేడుకలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్రావు, మైహోమ్ సిమెంట్ అధినేత రామేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.