సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుంచి శంకర్ విలాస్ సెంటర్ వరకు పీడీయస్‌యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం విద్యావ్యవస్థను కార్పొరేట్ శక్తులను అప్పగించే విధానాలను అమలు చేస్తుందని పీడీఎస్‌యూ నాయకులు ఆరోపించారు.
పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జరిగే అవకతవకలను నిరోధించేందుకు యూనివర్సిటీకి పర్మినెంట్ వీసీని నియమించాలని తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యకు 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ప్రవేశం కారణంగా పేద వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు పీజీ విద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ట్రంప్‌కి గుడికట్టి పూజలు చేస్తున్న వీర భక్తుడు