కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. లాక్డౌన్ సమయంలో ప్రతిపక్ష పార్టీగా తాము ఏ సూచన చేసినా.. ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్‌లో ఛాతీ ఆస్పత్రిలో కరోనా బాధితుడు ఆక్సిజన్ అందక మృతిచెందితే.. అది వాస్తవం కాదంటూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.. పక్కదారి పట్టించారని విమర్శించారు.
సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలను స్థానిక పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి ఆర్ దామోదర్‌రెడ్డితో కలిసి ఎస్పీ భాస్కర్‌కు ఉత్తమ్ ఫిర్యాదు చేశారు. జిల్లాలో కొందరు సీఐ, ఎస్ఐలు తమ కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
ఇవీచూడండి: ముఖ్యమంత్రి గారూ... తెలంగాణ ప్రజలను చంపకండి : రాజాసింగ్