ETV Bharat / state

ప్రియుడి చేతిలో మహిళ దారుణ హత్య

అనుమానం పెనుభూతమై ఓ మహిళ హత్యకు దారితీసింది. తనతో కాక.. మరోకరితో అక్రమసంబంధం పెట్టుకుంటుందనే నెపంతో నెల్లూరు జిల్లా గ్రామస్థుడు సిందే సవాల్​.. ఇద్దరు పిల్లల తల్లి అయిన రమాదేవిని హత్య చేశాడు. ఈ దారుణం సూర్యాపేట జిల్లా గణపవరంలో జరిగింది.

ప్రియుడి చేతిలో మహిళ దారుణ హత్య
author img

By

Published : Jun 20, 2019, 10:51 PM IST

ప్రియుడి చేతిలో మహిళ దారుణ హత్య
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరంలో ఓ మహిళ హత్యకు గురైంది. భర్తను వదిలి పొట్టకూటి కోసం సర్కస్​ వేసి జీవనం సాగించే రమాదేవిని.. ఆమె ప్రియుడు బుధవారం అర్ధరాత్రి కత్తితో పొడిచి చంపాడు. అనంతరం నిందితుడు తనను తాను గాయపరుచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్​ పశ్చిమగోదావరి జిల్లా పేరంపేటకు చెందిన తోట రమాదేవి.. తన భర్త యేసును వదిలి ఇద్దరు పిల్లలతో గణపవరంలో ఉంటుంది. ప్రియుడు సిందే సవాల్​ నెల్లూరు జిల్లా వెంకటగరి వాస్తవ్యుడు. గత కొంతకాలంగా వీరు అక్రమసంబంధంలో ఉన్నారు. రమాదేవి మరొకరితో ఉంటుందనే అనుమానంతో నిందితుడు మద్యం సేవించి హత్య చేశాడు. సిందే సవాల్​ను అరెస్టు చేసి తగిన న్యాయం చేయాలని రమాదేవి బంధువులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి... తల్లికి గాయాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.