Uttam Kumar Reddy Participated In Congress Meeting In Kodada: ఈ నెలాఖరులోపు శాసనసభ రద్దు జరిగి రాష్ట్రపతి పాలనలో.. ముందస్తు ఎన్నికలు వస్తాయని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరపాలని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని తెలిపారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు.. ఎమ్మెల్యేలకు తొత్తులుగా మారుతున్నారని ఆరోపించారు. కోదాడలో మెజార్టీ సాధించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాల్ విసిరారు. బీజేపీ దేశాన్ని మతపరంగా చిన్నాభిన్నం చేస్తుందని ఆరోపించారు. రాహుల్ గాంధీ పాదయాత్రతో దేశం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుందన్నారు. దళితబంధులో అవకతవకలు జరగకుండా పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు.
"తెలంగాణలో శాసనసభ రద్దుకాగానే.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోబోతోంది. ఈ బీఆర్ఎస్ను ఇంటికి పంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ను ఎప్పుడెప్పుడా తెలంగాణలో అధికారంలోకి తేవాలని చూస్తున్నారు జనం. నాకు అయితే అది తెలీదు కానీ కోదాడ, హుజూర్నగర్లో కాంగ్రెస్కు భారీ మెజార్టీ వస్తుంది. ఇది జరగకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. రేపు పార్లమెంటులో కూడా తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ప్రస్తావిస్తాను. దళితబంధు గురించి హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇందులో ఎమ్మెల్యేల ప్రమేయం ఉండకూడదని.. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇందులో పాలుపంచుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న దళితులు అందరికీ ఈ పథకం వర్తింపజేయు కేసీఆర్.. మట్టి మాఫియా పోలీసులకు, రెవెన్యూ అధికారులకు, ఎమ్మెల్యేలకు వాటాలను పంచడానికి ఉంది. లిక్కర్ మాఫియాలో మద్యంలో పోలీసులకు, ఎమ్మెల్యేలకు కొంత భాగం ఇవ్వాలి." - ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ
ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివిధ రూపాల్లో జనంలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసిన తరువాత ఆ యాత్రకు కొనసాగింపుగా దేశవ్యాప్తంగా రెండు నెలలపాటు హాథ్ సే హాథ్ జోడో అభియాన్ చేపట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఇప్పటికే జవనవరి 26న లాంఛనంగా ప్రారంభించిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా రెండు నెలలు కొనసాగనుంది.
హాథ్ సే హాథ్ జోడో యాత్రకు సర్వం సిద్దం: పీసీసీ చీఫ్ రేపు ములుగు జిల్లా మేడారం నుంచి యాత్ర ప్రారంభిస్తారు. మొత్తం 50 నియోజక వర్గాల్లో పర్యటించేందుకు సర్వం సిద్దమైంది. ఇందుకోసం కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఇవీ చదవండి: