సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ పొలంలో వరినాట్లు వేశారు. తుంగతుర్తి మండల కేంద్రంలో పర్యటిస్తున్న కిశోర్ వ్యవసాయ కూలీగా మారిపోయారు. రైతులతో కలసి సరదాగా వరినాట్లు వేశారు. ఎమ్మెల్యేతోపాటు జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్, పీడీ కిరణ్ కుమార్, జడ్పీఛైర్మన్ గుజ్జ దీపికా సహా పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు అంతా వరినాట్లు వేశారు. ఈ వీడియో.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇవీ చూడండి: ఆర్టికల్ 370 సమస్యకు పరిష్కారం 370నే