రైతు సంక్షేమానికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లో రైతు వేదిక భవన నిర్మాణాలకు శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఆరో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
నియోజకవర్గంలోని నూతనకల్ మండలం మిర్యాల, దర్షనపల్లి, మద్దిరాల మండల కేంద్రం, మండల పరిధిలోని ముకుందాపురం, తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో రైతు వేదిక భవనాలు నిర్మించనున్నామని గాదరి కిశోర్ తెలిపారు. ఈ వేదికలను అన్నదాతలు సద్వినియోగం చేసుకొని వ్యవసాయంలో కొత్తమార్గాలను అవలంభించి లాభాలు సంపాదించాలని పేర్కొన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను కాపాడుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇదీ చదవండి : ప్రగతి భవన్కు చేరుకున్న సీఎం కేసీఆర్