కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ లాక్డౌన్ అమలుచేస్తూనే ప్రజలందరికీ ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పట్టణంలో రూ.34లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ-సీసీ రోడ్లు, రూ.5లక్షలతో నిర్మించనున్న చేపల మార్కెట్కు భూమి పూజ చేశారు.
మంత్రి కేటీఆర్ సూచనలతో మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని అన్నారు. కరోనా వేళ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను 94 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: కరోనా సోకిందనే మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య