ప్రస్తుత రోజుల్లో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి తమ పిల్లలు గొప్ప ఉద్యోగాలు సాధించాలన్న తపన తల్లిదండ్రుల్లో అధికమవుతుందని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో నైపుణ్యం పెంచే విధంగా వారికి తర్ఫీదు ఇవ్వాలన్నారు. ఎటువంటి కష్టం తెలియకుండా అపురూపంగా పెంచిన పిల్లల్లో ఓటమిని జీర్ణించుకునే సామర్ధ్యాలు తగ్గిపోతున్నాయని వివరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జవహర్ బాల కేంద్రానికి సంగీత పరికరాలు అందించే కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులకు ప్రశంసా పత్రాలను అందించారు.
ఇవీ చూడండి: 'డీ లిమిటేషన్ ప్రక్రియ మరోసారి చేపట్టాలి'