దుబ్బాక ప్రజలు భాజపా, కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి వద్ద... తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ను కలుపుతూ కృష్ణా నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. హుజూర్నగర్ ఫలితమే దుబ్బాకలోనూ పునరావృతం కానుందని ధీమా వ్యక్తం చేశారు. భాజపా, కాంగ్రెస్ డిపాజిట్ల కోసం పోటీ పడుతున్నాయని దుయ్యబట్టారు.
దుబ్బాకలోనూ హుజూర్నగర్ ఫలితమే: జగదీశ్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సంపూర్ణ విశ్వాసంతో... ఏ ఎన్నికలు వచ్చినా రాష్ట్ర ప్రజలు తెరాసకు పట్టం కడుతున్నారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. దొంగే దొంగా దొంగా అన్నట్టు భాజపా పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. ప్రజలను గందరగోళంలోకి నెట్టి లబ్ధిపొందాలనుకుంటున్న వారి జిమ్మిక్కులు ప్రజలు నమ్మరన్నారు. ఎన్నికల కమిషన్‌ను కూడా తప్పుదోవ పట్టించిన చరిత్ర ఆ రెండు పార్టీలకు ఉందని... అదే పని దుబ్బాకలోనూ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అక్కడి ప్రజల నిర్ణయానికే వదిలేశారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కూతురి హత్య కేసులో తండ్రి, సవతితల్లి, మామకు యావజ్జీవం