గ్రంథాలయము అంటే దేవాలయంతో సమానమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అభిప్రాయపడ్డారు. హుజూర్నగర్ గ్రంథాలయ 52వ వారోత్సవాల వేడుకల్లో సైదిరెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయాన్ని అత్యాధునికంగా మార్చేందుకు రూ. 2 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పుస్తకాలను చదవటం ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. దాతలు ముందుకొచ్చి గ్రంథాలయాలకు సహాయ సహకారాలు అందిస్తే అభివృద్ధి సులభతరమవుతుందని సైదిరెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి : 'రాయాల్సింది సూసైడ్‌నోట్ కాదు... తెరాసకు మరణ శాసనం'