ETV Bharat / state

రైతులు దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ కోరుకుంటున్నారు: జగదీశ్వర్​రెడ్డి

Jagadeeshwar reddy fires kishan reddy: బీజేపీ హయాంలోనే వ్యవసాయానికి అధిక నిధులు ఇచ్చామన్న కేంద్రమంత్రి కిషన్​రెడ్డి వ్యాఖ్యలకు, ఉపాధి హామీ నిధులు పక్కదారి పట్టించారన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.మోదీ, రైతులకు క్షమాపణ చెప్పిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు.

Jagadhiswar reddy
Jagadhiswar reddy
author img

By

Published : Dec 24, 2022, 10:57 PM IST

Jagadeeshwar reddy fires kishan reddy: ఒకవైపు వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతూ, మాది రైతు అనుకూల ప్రభుత్వమని బీజేపీ నేతలు అనడం సిగ్గు చేటని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, వ్యవసాయ వ్యతిరేక విధానాలపై ఉద్యమించిన రైతులకు క్షమాపణ చెప్పిన మొదటి ప్రధానిగా మోదీ మిగిలారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికో విధానం పాటిస్తూ బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్న చోట వివక్ష చూపుతున్నారని విమర్శించారు.

బండి వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని, వారి మాటలు చూసి నవ్వుకుంటున్నారని అన్నారు. బీజేపీ రైతు విధానాలను నిరసిస్తున్న రైతులు, దేశ వ్యాప్తంగా తెలంగాణా మోడల్ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ సరిహద్దు రైతులు మమ్మల్ని తెలంగాణాలో కలపమని పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. బీజేపీ మోడీ విధానాలకు, కేసీఆర్ విధానాలకు తేడాను దేశంలోని రైతులు గుర్తిస్తున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి నమూనా దేశ మొత్తం విస్తరించేందుకు బీఆర్ఎస్ ఏర్పాటు చేశామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.