సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెంలోని ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు నిలిచిపోవటం వల్ల సూర్యాపేట- జనగాం రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఓ వైపు అధికారుల నిర్లక్ష్యం, మరోవైపు గన్నీ బ్యాగులు లేకపోవడం వల్ల గత 15రోజుల నుంచి ధాన్యం కొనుగోలును అధికారులు నిలిపివేశారు. ఇవాళ కడుపు మండిన రైతన్నలు రోడ్డెక్కి ధాన్యం కొనాలంటూ రాస్తారోకో చేశారు. దీనివల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ధాన్యం కొనాలంటూ.. రోడ్డెక్కిన రైతన్న - Farmers Demand for buy the grains and Strike on road at ramannagudem in suryapeta district
రైతులకు ఇబ్బంది కల్గకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ పదేపదే అధికారులకు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇప్పటికీ అమలు కావడం లేదు. సూర్యాపేట జిల్లాలో గత 15రోజులుగా ధాన్యం కొనుగోలును నిలిపివేయటం వల్ల రైతులు రాస్తారోకో చేశారు.

ధాన్యం కొనాలంటూ... రోడ్డెక్కిన రైతన్న