ETV Bharat / state

ఇండ్లు ఇప్పించిన మరుగు దొడ్లు

రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. రోజూ కూలీలకు వెళ్తూ... పూరి గుడిసెల్లో నివసిస్తుంటారు. అయితేనేం... ఉండేది పూరి గుడిసెల్లోనే అయినా  ప్రతి ఇంటికొక మరుగుదొడ్డి నిర్మించుకొని స్వచ్ఛభారత్​లో ముందున్నారు. అదెక్కడో కాదండి సూర్యాపేట జిల్లాలోనే.

author img

By

Published : Jul 14, 2019, 5:19 PM IST

ఇండ్లు ఇప్పించిన మరుగు దొడ్లు
ఇండ్లు ఇప్పించిన మరుగు దొడ్లు

ఆ కాలనీలో అందరూ నిరు పేదలే...ఎక్కడ చూసినా పూరిగుడిసెలే. వారి జీవితం అరకొర వసతుల మధ్య సాగుతుంది. అయినా స్వచ్ఛత విషయంలో ఎక్కడ వెనక్కు తగ్గలేదు. ప్రతి పూరి గుడిసెపక్కన మరుగుదొడ్డి నిర్మించుకొని సూర్యాపేట జిల్లాలోని జముననగర్​ కాలనీవాసులు స్వచ్ఛ భారత్​లో ముందున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డితో శభాష్ అనిపించుకున్నారు. అంతేనా... ఆ మరుగు దొడ్లకు తగ్గట్టుగా ఉండేలా రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తామని అధికారులతోనే చెప్పించుకున్నారు.

సినీనటి జమున కట్టించిన ఇళ్లు

సూర్యాపేట జిల్లాలోని జమున నగర్​లో మొత్తం 250 మంది జనాభా ఉన్నారు. 52 కుటుంబాలతో ఉన్న ఈ కాలనీ కాసరబాద్ గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. ఇక్కడున్న వారంతా నిరుపేదలు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. వీరు రోజూ కూలీకి వెళ్తూ జీవనం సాగిస్తుంటారు. కుల వృత్తిలో భాగంగా నాటకాలు ప్రదర్శిస్తూ... అప్పట్లో సినీనటి జమున దృష్టిలో పడ్డారు. 1981లో ఈ గ్రామంలో ఉన్న 22 కుటుంబాలకు గాను జమున పెంకుటిళ్లు నిర్మించి ఇచ్చారు. కాల క్రమేణా కుటుంబాల సంఖ్య రెట్టింపైంది. జమున నిర్మించిన గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం అన్నీ కూలిపోయే దశలో ఉన్నాయి. వాటిని వదిలి గ్రామస్థులు పూరి గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఉండేది పూరి గుడెసెల్లోనే అయినా ప్రతి ఒక్కరు తమ గుడిసె పక్కన మరుగుదొడ్డి నిర్మించుకున్నారు.

ఒక్క ఫొటోతో జీవితాలు మారిపోయాయి

గతేడాది ఈ విషయంపై ఈనాడు ప్రచురించిన ఒక ఫొటో కథనం వీరి జీవితాల్లో వెలుగులు నింపింది. గ్రామస్థులందరికీ రెండు పడక గదుల ఇండ్లు మంజూరయ్యేలా చేసింది. ఓ యువకుడు గుడిసెలో నివాసం ఉంటూనే... పక్కనే నిర్మించుకున్న మరుగుదొడ్డి చిత్రాలు అప్పటి మంత్రి కేటీఆర్ దృష్టిని ఆకర్షించాయి. దీనిపై స్పందించిన కేటీఆర్ యువకుడిని ప్రశంసిస్తూ... అతడికి రెండుపడక గదుల ఇంటిని మంజూరు చేయాలని కలెక్టర్​కు ఆదేశించారు. తర్వాత కొన్నాళ్లకి మంత్రి జగదీశ్ రెడ్డి ఈ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్థుల స్వచ్ఛ భారత్ చైతన్యానికి స్పందించి అక్కడికక్కడే 52 రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాల పనులు వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సాయంతో మరుగుదొడ్లు కట్టుకున్న తమకు రెండు పడక గదుల ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు.

వందశాతం మరుగుదొడ్లు ఉపయోగిస్తున్న జిల్లాగా మార్చేందుకు అధికారులు రెండేళ్లుగా కృషి చేస్తున్నప్పటికీ... ఇంకా 2 శాతం నివాసాలకు మరుగుదొడ్లు లేవు. నిరుపేదలైన జమున నగర్ వాసులు మాత్రం వంద శాతం మరుగుదొడ్లను నిర్మించుకొని.. అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఇవీ చూడండి: కర్ణాటకీయం: కూటమికి ఝలక్- ముంబయికి నాగరాజు

Intro:Tg_wgl_21_14_lnagrations_Health_kits_pampine_ab_Bites_TS10071
NarasimhaRao, Mahabubabad,9394450198
ఫస్ట్ ఫైల్ లి విజువల్స్ పంపించాను.
ఈ ఫైల్ లో స్క్రిప్ట్ పంపిస్తున్నాను

Body:విజువల్స్, స్క్రిప్ట్ ను ఫస్ట్ ఫైల్ లో పంపించాను.
ఈ ఫైల్ లో బైట్స్ పంపిస్తున్నాను.

Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.