సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయిలో నరకాసుర వధ ఘనంగా నిర్వహించారు. కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన రుక్మిణి సత్యభామ గోదాదేవి సమేత శ్రీ సంతాన వేణుగోపాలస్వామి దేవస్థానంలో వేడుకలు అంబరాన్నంటాయి. ముందుగా శ్రీకృష్ణ సమేత సత్యభామను మంగళవాద్యాలతో ఊరేగించారు. అనంతరం బొడ్రాయి సెంటర్లో నరకాసురుడిని దహనం చేశారు. యువకులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పెద్దలు, యువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇవీచూడండి: దివ్వెల కాంతులు... టపాసుల జిలుగులు...