రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని నిరసిస్తూ.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు నిరసన దీక్ష నిర్వహించారు. కళ్లాల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతున్నా.. వాస్తవంగా అమలు జరగడంలేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ తెలిపారు. ప్రభుత్వం ప్రతి గింజని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై రైతుల వద్ద దోచుకుంటున్నారని ఆరోపించారు.
అన్నదాతలు పండించిన పంటను కొనుగోలు చేసి వెంటనే వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలో కరోనా పరీక్షలు నిర్వహించడం లేదని ఆరోపించారు. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, అధికారుల వైఫల్యం కారణంగా కరోనా మహమ్మారి విస్తరించిందని విమర్శించారు.
ఇవీ చూడండి: రెండింటా పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం: ఉత్తమ్