ETV Bharat / state

'రైతులకు అన్యాయం చేస్తే కేసీఆర్ ఇంకా పడిపోతారు'

హుజూర్​నగర్​ మున్సిపాలిటీ సమావేశంలో అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. మున్సిపాలిటీ నిధులు విచ్చలవిడిగా ఖర్చవడం పట్ల ఓ కౌన్సిలర్​ ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతుండటం పట్ల ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని మరో కౌన్సిలర్​ అన్నారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించిన ఆయన.. ఎన్నికల్లో గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు.

uttam kumar reddy, huzurnagar municipality
ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, హుజూర్​నగర్​ మున్సిపాలిటీ సమావేశం
author img

By

Published : Jan 18, 2021, 7:07 PM IST

Updated : Jan 18, 2021, 7:44 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ మున్సిపాలిటీ సమావేశంలో కౌన్సిలర్ల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. మున్సిపాలిటీ సమావేశం ఎజెండాను కౌన్సిలర్లకు పంపకుండా తయారు చేయడమేంటని కౌన్సిలర్లు ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ ఆర్​ఆర్డీఓ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు రూ. 50 లక్షలు ఎలా ఖర్చయ్యారని ప్రశ్నించారు. ఎవరిని అడిగి డబ్బులు డ్రా చేశారని ప్రశ్నించారు. హుజూర్​నగర్ పట్టణంలో ప్రభుత్వ భూమి 70 వేల గజాల భూమి ఉన్నదని.. దాంట్లో 13వేల గజాల భూమి ఆక్రమణకు గురైందని పేర్కొన్నారు. ఆ భూమిని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని కౌన్సిలర్లు అన్నారు. అక్రమంగా నిర్మించిన లేఅవుట్​ను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమి చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి హాజరయ్యారు.

ఎజెండాను పాటించాలి

వాదోపవాదాల అనంతరం ఉత్తమ్​ సమావేశంలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే హుజూర్​నగర్​ మున్సిపాలిటీ ఏర్పడిందని, తద్వారానే పట్టణం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. మున్సిపాలిటీలో నిధులు ఖర్చు చేయాలంటే ఎజెండా ప్రకారం చేయాలని సూచించారు. పట్టణ అభివృద్ధి విషయంలో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అక్రమ లే అవుట్ గురించి కలెక్టర్​ మాట్లాడానని మరోసారి చర్చిస్తానని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కోదాడ, హుజూర్​నగర్​లలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాలేదని వెల్లడించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అందరిమీద ఉందని సూచించారు. భూములు దుర్వినియోగం అవుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విషయంపై ఎక్కడైనా మాట్లాడతానని అన్నారు.

అనంతరం ఉత్తమ్​.. మీడియాతో మాట్లాడారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్​దే అని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రాష్ట్ర ప్రభుత్వమే ఒకడుగు ముందుకేసి వాటిని అమలు చేస్తోంది. రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. రైతులకు అన్యాయం చేస్తే వరస్ట్ సీఎంలలో నాలుగో స్థానంలో ఉన్న కేసీఆర్ మొదటి స్థానానికి రావడం ఖాయం.

ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

మఠంపల్లి మండలం, హుజూర్ నగర్ టౌన్​లో రూ. వందల కోట్ల విలువైన భూములను ప్రభుత్వానికి చెందిన వ్యక్తులే కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రభుత్వ అధికారులు కుమ్మకైతే కోర్టులను ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.

మున్సిపాలిటీ సమావేశంలో అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య వాడివేడిగా చర్చ

ఇదీ చదవండి: వరద సాయం పంపిణీపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలి: హైకోర్టు

Last Updated : Jan 18, 2021, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.