నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలోని ఒకే కుటుంబంలో ఆరుగురుకి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్రమత్తమైన ప్రభుత్వం గ్రామాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించింది. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని గ్రామంలో పిచికారి చేశారు. ఆశా వర్కర్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి మరోసారి వివరాలు సేకరిస్తున్నారు.
గ్రామానికి చేరుకునే ప్రధాన రహదారిని బారికేట్లతో మూసివేశారు. నిత్యవసరాల కోసం కూడా ప్రజలు వీధుల్లోకి రావద్దని తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు. కూరగాయల్ని ఇంటి వద్దకే తీసుకువచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు.
ఇవీ చూడండి: ఆరు నెలల బిడ్డకు అమ్మగా.. బాధ్యతగల ఉద్యోగిగా..