ETV Bharat / state

BRS Praja Ashirvada Sabha at Kodad : తెలంగాణ హక్కులను కాపాడేది గులాబీ పార్టీనే : కేసీఆర్​ - కోదాడలో బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభ

BRS Praja Ashirvada Sabha at Kodad in Telangana : తెలంగాణకు బీఆర్​ఎస్​నే శ్రీరామరక్ష అంటూ.. రాష్ట్ర హక్కులు కాపాడే పార్టీ గులాబీ పార్టీ మాత్రమే అంటూ బీఆర్​ఎస్​ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్​ అన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరగాలని తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని.. ప్రసంగించారు.

BRS Praja Ashirvada Sabha
BRS Praja Ashirvada Sabha at Kodad
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2023, 3:31 PM IST

Updated : Oct 29, 2023, 4:15 PM IST

BRS Praja Ashirvada Sabha at Kodad in Telangana : కోదాడలో కాళేశ్వరం నీళ్లు రాలేదని భట్టి విక్రమార్క చెబుతున్నారని.. కానీ మూడేళ్లుగా కాళేశ్వరం(Kaleshwaram Project) నీళ్లు ఇక్కడకు వస్తున్నాయని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ అన్నారు. తెలంగాణకు బీఆర్​ఎస్​నే శ్రీరామరక్ష.. రాష్ట్ర హక్కులు కాపాడే పార్టీ గులాబీ పార్టీ మాత్రమే అంటూ బదులిచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభ(BRS Public Meeting)లో ఆయన పాల్గొని.. ప్రసంగించారు.

బీఆర్​ఎస్​ హయాంలో కర్ఫ్యూ, కరవు రాలేదని సీఎం కేసీఆర్​ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరగాలని అన్నారు. బీఆర్​ఎస్​ సాగు నీరు అందివ్వాలని పోరాటం చేస్తోందని.. ఈసారి పంట పొలాలకు సంపూర్ణంగా నీరు అందించే బాధ్యత తనది అంటూ హామీ ఇచ్చారు. ఆనాడు కోదాడలో పంట పొలాలకు నీరు రావాలంటే ధర్నా చేయాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. 24 గంటల్లోగా నీరు ఇవ్వకపోతే 5 లక్షల మందితో ధర్నా చేస్తామంటూ హెచ్చరించామని ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. నాడు తాను మాట్లాడేంత వరకు రాష్ట్రానికి రావాల్సిన నీటి హక్కుల గురించి ఎవరూ మాట్లాడలేదని వివరించారు. కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశానని.. ఆ యాత్ర సమయంలో పంటపొలాలకు నీరు లేక ఇబ్బంది పడేవారని గత రోజులను గుర్తు చేసుకున్నారు.

CM KCR Speech at Paleru Meeting : కాంగ్రెస్ అధికారంలోకి​ వస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్‌ అంటారు : సీఎం కేసీఆర్

"ఈసారి కోదాడలో బీఆర్​ఎస్​ను గెలిపించండి. రూ.10 కోట్లతో బీసీ భవనాన్ని నిర్మిస్తాము. ఈ ఏడాదే సాగర్​ ప్రాజెక్టు నిండలేదు కానీ.. గత పదేళ్లుగా కరవు లేదు.. కర్ఫ్యూ లేదు. కర్ణాటక నుంచి ఒక పెద్ద లీడర్​ వచ్చాడు. కర్ణాటకలో రైతులకు ఐదు గంటల కరెంటు అందిస్తున్నామన్నారు. తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తే ఇక్కడకు వచ్చి ఐదు గంటల కరెంటు ఇస్తున్నామంటే అంతకంటే దిగజారుడు రాజకీయం ఇంకా ఏమైనా ఉంటుందా?. తెలంగాణలో కాంగ్రెస్​ను నమ్మి ఓటేస్తే గ్యారెంటీగా మోసపోవడం ఖాయం." - కేసీఆర్​, బీఆర్​ఎస్​ అధినేత

BRS Election Campaign at Kodad : నాగార్జున సాగర్​ ప్రాజెక్టు పేరుకు.. రాష్ట్ర ప్రభుత్వం నందికొండ ప్రాజెక్టుగా పేరు పెట్టుకుందన్నారు. కోదాడలో బీసీకి అవకాశం ఇచ్చిన పార్టీ బీఆర్​ఎస్​నే అని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ హర్షించారు. బీసీ చైతన్యం చూపించాల్సిన బాధ్యత కోదాడ ప్రజలపై ఉందని చెప్పారు. మల్లయ్య యాదవ్​ గెలవరు అని చెప్పినా.. కోదాడ టికెట్​ ఇచ్చానని.. ఆయనను గెలిపించాల్సిన బాధ్యత బీసీలదే అంటూ సూచించారు. కోదాడలో రూ.10 కోట్లతో బీసీ భవన్​ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఓటు మన భవిష్యత్తుకు అస్త్రమంటూ కేసీఆర్​ పేర్కొన్నారు. రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తున్న పార్టీ బీఆర్​ఎస్​ అనీ.. కాంగ్రెస్​ మాత్రం 3 గంటల కరెంటు చాలు అంటోందన్నారు.

BRS Praja Ashirvada Sabha at Kodad తెలంగాణ హక్కులను కాపాడేది గులాబీ పార్టీనే : కేసీఆర్​

CM KCR Election Campaign in Joint Nalgonda Today : ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు.. నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ సభలు

CM KCR Mahabubnagar Praja Ashirwada Sabha Speech : రైతుబంధు వృథా అంటున్న కాంగ్రెస్​ నేతలకు బుద్ధి చెప్పాలి : సీఎం కేసీఆర్

Last Updated : Oct 29, 2023, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.