సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో 35 మందికి మాజీ ఎమ్మెల్యే పద్మావతి కాంగ్రెస్ బీ-ఫామ్‌లు అందజేశారు. పార్టీ తరఫున 112 మంది నామపత్రాలు దాఖలు చేయగా... చివరి వరకు తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఆశావహులను ఉపసంహరించుకునేలా ఆమె ఒప్పించి అధికారికంగా అభ్యర్థులను ప్రకటించారు.
కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్‌గా గెలిచినవారు వేరే పార్టీలోకి వెళ్లకుండా అభ్యర్థులతో బాండ్ పేపర్‌పై సంతకాలు చేయించుకున్నారు. టికెట్ రాని వారికి భవిష్యత్‌లో పార్టీ అండగా నిలుస్తుందని పద్మావతి హామీ ఇచ్చారు. పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: గద్వాల సంస్థానంలో పుర సమరం