Jan Pahad Dargah: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలోని పాలకీడు మండలం జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి మూడు రోజులపాటు వేడుకలు జరగనున్నాయి. జాన్ పహాడ్ దర్గా ఉత్సవాలు.. ఏటా జనవరిలో నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలకు ఏపీ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి సుమారు లక్ష మందికిపైగా భక్తులు వస్తారు. సంతాకం లేనివారు ఎక్కువగా ఈ దర్గాలో పూజలు చేస్తారని తెలిపారు. ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లుచేసినట్లు తెలిపారు.
ఉర్సు ఉత్సవాల్లో ముఖ్య ఘట్టాలు..
27వ తేదీ...
- గురువారం తెల్లవారుజామున 4 గంటలకు గుసూల్ వేడుకలతో ఉత్సవాలు ప్రారంభం
- సైదులు బాబా, అతని తమ్ముడు సమాధులపై ఉన్న పాత ఛాదర్లు, దట్టీల తొలగింపు
- సమాధులను నీటితో శుభ్రం చేసి పరిమళ గంధంపూసి నూతన ఛాదర్లు, దట్టీలు వేస్తారు
- గులాబీ, మల్లె పూలతో సమాధులను అలంకరిస్తారు
- 6 గంటలకు జల్సా ఈ సిరత్ కార్యక్రమం నిర్వహించి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు
28వ తేదీ..
- పవిత్ర గంధోత్సవం
- ఉదయం 9 గంటలకు.. హైదరాబాద్ నాంపల్లి దర్గా, దర్గా ముజావర్ ఇంటి నుంచి తెచ్చిన రెండు గంధాలను కలిపి చందన ఖానా భవనంలో ప్రత్యేక నమాజ్‌ను నిర్వహిస్తారు
- పూర్వ జాన్ పహాడ్ గ్రామపరిధిలోని 4 గ్రామాల్లో గుర్రాలపై ఊరేగింపు నిర్వహించి, సాయంత్రం 4 గంటల సమయంలో పవిత్ర గంధాన్ని సమాధులపైకి ఎక్కిస్తారు. ఇదే ఈ వేడుకల్లో కీలక ఘట్టం
- ప్రజాప్రతినిధులు, లక్షకు పైగా భక్తులు ఈ గంధం ఊరేగింపు కార్యక్రమానికి హాజరవుతారు
29వ తేదీ..
- సాయంత్రం 6 గంటలకు దీపారాధన వేడుకలతో ఉర్సు ఉత్సవాలకు ముగింపు పలుకుతారు
ఇదీచూడండి: