ETV Bharat / state

తిరుమలగిరిలో తాజాగా 13 మందికి కరోనా.. మొత్తం 71కి పెరిగిన సంఖ్య - 13 corona positive cases in telangana

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో ఒకే రోజు 13 మందికి కరోనా పాజిటివ్​ రాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 71కి పెరిగినట్లు వైద్యాధికారి ప్రశాంత్​బాబు వెల్లడించారు. తొండా గ్రామంలో 2, తాటిపాములలో 5, తిరుమలగిరిలో 6 కేసులు నమోదయ్యాయని.. ఆయా గ్రామాల్లో హైపోక్లోరైట్​ ద్రావణాన్ని పిచికారి చేయించాలని అధికారులకు సూచించారు.

13 corona positive cases in telangana
తిరుమలగిరిలో తాజాగా 13 మందికి కరోనా.. మొత్తం 71కి పెరిగిన సంఖ్య
author img

By

Published : Aug 22, 2020, 4:40 PM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో ఒకే రోజు 13 మందికి కరోనా పాజిటివ్​ రాగా.. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మండలంలోని పీహెచ్​సీలో శనివారం 17 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 13 మందికి వైరస్ నిర్ధరణైంది. తొండా గ్రామంలో 2, తాటిపాములలో 5, తిరుమలగిరిలో 6 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మండలంలో 57 యాక్టివ్​ కేసులు ఉండగా.. ప్రస్తుతం ఆసంఖ్య 71కి పెరిగింది.

corona positive cases in suryapeta district
హోం ఐసోలేషన్​ కిట్లను అందజేస్తున్న సిబ్బంది

కరోనా పాజిటివ్​ వచ్చిన వ్యక్తులకు హోం ఐసోలేషన్​ కిట్లను అందించారు. మండలంలో కరోనా కట్టడి కోసం వ్యాపారస్థులు రోజులో కేవలం 8 గంటలు మాత్రమే వ్యాపార లావాదేవీలు జరిపేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కొవిడ్​ నియంత్రణకు ప్రజలందరూ జాగ్రత్తలు వహించాలని వైద్యాధికారి ప్రశాంత్​ బాబు సూచించారు. వైరస్​ సోకిన గ్రామాల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించాలని విజ్ఞప్తి చేశారు. . ప్రజలు బయటకు వస్తే కచ్చితంగా మాస్కు ధరించాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.