సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో స్థానిక పోచమ్మ గుడి వద్ద చేనేత కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రతి చేనేత కుటుంబానికి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా పది లక్షల ఋణం అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతు బీమా తరహా చేనేత బీమా పథకం అమలు చేయాలని, సిరిసిల్ల తరహాలో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయాలని కోరారు.
చేనేత సహకార సంఘంలో నూతన సభ్యత్వాలు అందివ్వాలని, జియో ట్యాగ్ సంఖ్యలను పెంచి ప్రతి చేనేత కుటుంబానికి అందేలా చూడాలని, అర్హులైన చేనేత కుటుంబాలకు అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలన్నారు.
ఇదీ చదవండి: ఇకనుంచి తహసీల్దార్లే జాయింట్ రిజిస్ట్రార్‌లు: కేసీఆర్