సిద్దిపేట జిల్లా జగదేవపూర్ సహకార సంఘం ఛైర్మన్ ఎన్నికలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తున్న సమయంలో తనకు ఛైర్మన్ పదవి దక్కడం లేదని తీగుల్ సంఘానికి చెందిన డైరెక్టర్ భూమయ్య పరుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తమ వర్గానికి చెందిన వారికి ఛైర్మన్ పదవి దక్కకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ మరో సీనియర్ కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణ యత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ రెండు సంఘటనలతో జగదేవపూర్ మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
సహకార సంఘం ఛైర్మన్ పదవి కోసం ఇంద్రసేనారెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా ఎన్నిక ఏకగ్రీవమైంది. అధ్యక్ష ఎన్నిక వాయిదా వేయాలని కార్యకర్తలు బయట నినాదాలు చేశారు.
- ఇదీ చూడండి : తెరాస, భాజపా నాయకుల మధ్య ఘర్షణ