సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలోని స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హాజరై.. పార్టీ జెండాను ఎగురవేశారు.
అనంతరం వేడుకలకు హాజరైన నాయకులు, ప్రజలకు ఎమ్మెల్యే మాస్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ ఛైర్పర్సన్ గన్నె వనిత, జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: తెరాస భవన్లో కేసీఆర్ పతాకావిష్కరణ