ETV Bharat / state

'కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి' - సోలిపేట సుజాత ఎన్నికల ప్రచారం వార్తలు

దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకే ఓటు వేయాలంటూ అభ్యర్థించారు.

trs compaign in dubbaka constituency
'కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి'
author img

By

Published : Oct 19, 2020, 2:31 PM IST

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గోవిందాపూర్, కోనాయిపల్లి, ఉప్పర్​పల్లి, గువ్వలేగి గ్రామాల్లో తెరాస అభ్యర్థి సుజాత, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్​రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు బోనాలు, బతుకమ్మలు, డబ్బు చప్పుళ్లతో వారికి ఘన స్వాగతం పలికారు.

సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న తెరాస ప్రభుత్వానికి మద్దతు పలకాలని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి సుజాతను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, భాజపా నాయకులకు ఓట్లు వేస్తే.. చెత్త బుట్టలో వేసినట్లే అవుతుందని విమర్శించారు.

ప్రజలంతా తెరాస వైపే ఉన్నారు..

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలంతా తెరాసవైపే ఉన్నారని ప్రతాప్​రెడ్డి పేర్కొన్నారు. అది చూసి జీర్ణించుకోలేక భాజపా, కాంగ్రెస్​ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. భాజపాకు ఓటేస్తే.. వ్యవసాయ బోర్ల వద్ద మీటర్లు పెడతారని.. కాంగ్రెస్​కు ఓటేస్తే కరెంటు కష్టాలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చూడండి.. ఆ విషయం నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: హరీశ్‌రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.