ETV Bharat / state

'ఇక్కడ ఫాస్టాగ్​తో పనిలేకుండానే వాహనాల రాకపోకలు' - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు

దేశంలోని ప్రధాన రహదారులపై టోల్​ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని సోమవారం అర్ధరాత్రి నుంచి కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని రాజీవ్​ రహదారిపై మాత్రం ఫాస్టాగ్​తో పనిలేకుండానే ప్రయాణించవచ్చు.

travel without working Fastag On Rajiv Road in Siddipet district
'ఇక్కడ ఫాస్టాగ్​తో పనిలేకుండానే వాహనాల రాకపోకలు'
author img

By

Published : Feb 14, 2021, 9:33 PM IST

సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రహదారిపై ఫాస్టాగ్​తో పనిలేకుండా నగదు చెల్లించి వాహనాల రాకపోకలు సాగించవచ్చు. హైదరాబాద్​ నుంచి రామగుండం వరకు 218 కిలోమీటర్లు ఉన్న ఈ రహదారిపై నిత్యం 15 వేలకు పైగా వాహనాలు రాకపోకలను సాగిస్తున్నాయి. సిద్దిపేట సమీపంలోని దుద్దెడ, కరీంనగర్ సమీపంలోని రేణిగుంట, రామగుండం సమీపంలోని బల్వంతపూర్ వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి.

దేశంలోని ప్రధాన రహదారులపై టోల్​ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని సోమవారం అర్ధరాత్రి నుంచి కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే జిల్లాకు సమీపంలోని దుద్దెడ టోల్ ప్లాజా రాష్ట్ర రహదారి పరిధిలో ఉన్నందున ఫాస్టాగ్​తో పనిలేకుండానే వాహనదారులు నగదు చెల్లించి ప్రయాణించవచ్చని... టోల్ ప్లాజా మేనేజర్ అశోక్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఇంకా ఫాస్టాగ్ సేవలు అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కిన నాగార్జునసాగర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.