సిద్దిపేట జిల్లాకు చెందిన మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి(74) మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన మృతి తెరాలకు తీరని లోటని సీఎం పేర్కొన్నారు. రాజకీయాలలో విలువలు కలిగిన వ్యక్తి ముత్యంరెడ్డి అని స్పీకర్ తెలిపారు.
హరీశ్‌రావు సంతాపం...
ముత్యంరెడ్డి మృతిపట్ల హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక గొప్ప నాయకున్ని కోల్పోయామని హరీశ్‌రావు తెలిపారు. తెరాసలో చేరిన కొద్దిరోజుల్లో ముత్యంరెడ్డి అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు.