సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో భాజపా నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యమంత్రి వెంటనే బేషరతుగా భాజపా ఎంపీలపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని... క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులను వెంటనే చర్చలకు పిలిచి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఇదీ చూడండి: 'కార్మికుల చావులకు సంఘాలు, విపక్షాలే బాధ్యత వహించాలి