సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాతర్ పల్లి, కోమటి బండ, మక్త మాసన్ పల్లి గ్రామాలకు చెందిన రైతులు నియంత్రిత పంటల సాగు చేస్తామంటూ ప్రతిజ్ఞ చేసి ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణను ధాన్యాగారంగా మార్చి ప్రపంచంతో పోటీ పడేలా పంటల సాగు చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగా పంటల సాగు జరగాలని వంటేరు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'